తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లిగ్స్ నేటి విజేత ఆర్మూర్…..

On: Sunday, July 13, 2025 6:18 AM

 

*సెంచరీ తో విజృంభించిన రతన్ విజ్ఞాన్ 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 19, అంతర్ జిల్లాల స్థాయి వన్ డే క్రికెట్ పోటీలలో భాగంగా శనివారం రోజు జరిగిన పోటీలలో ఆర్మూర్ క్రికెట్ టీం తో నిర్మల్ క్రికెట్ టీం పోటీపడగా మొదట టాస్ గెలిచిన ఆర్మూర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకునీ నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగులు చేయగా రతన్ విజ్ఞాన్ 88 బంతుల్లో 100 పరుగులు, మతీన్ 80 పరుగులు, గుఫ్రాన్ 74 పరుగులు, హేమంత్ 56 పరుగులు చేయగా నిర్మల్ క్రికెట్ టీం 187పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. నిర్మల్ జట్టు క్రీడాకారుడు శ్రీపాద 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన ఫలితం దక్కలేదు. నేడు జరిగిన మ్యాచ్లో రతన్ విజ్ఞాన్ 100 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు రతన్, రఫీ లు ఎంపైర్ లుగా, సల్లు స్కోరర్ గా వ్యవహరించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గురువా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

23 Jul 2025

Leave a Comment