నిజామాబాద్ A9 న్యూస్:
భీంగల్ మండలం జాగరియాల్ గ్రామంలో దండోరా మాదిగ సంఘం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం.. తెలుపుతున్న దండోరా మాదిగ సంఘం సభ్యులు.
భీంగల్ మండలంలోని జాగిరియాల్ గ్రామానికి చెందిన
దండోరా మాదిగ సంగం సభ్యులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెంటే ఉంటామని, సంఘం మొత్తం 40 కుటుంబ సభ్యులు కారు గుర్తుకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సోమవారం సంఘం సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి మద్దతుగా కారు గుర్తు కు ఓటు వేస్తామని దండోరా మాదిగ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.ఈ సందర్భంగా మీడియాతో దండోరా మాదిగ సంఘం అధ్యక్షుడు గడలా మూర్తి మాట్లాడుతూ. బాల్కొండ నియోజకవర్గంలో మండలాల్లో గ్రామాలలో సీఎం కేసీఆర్ నీ ఒప్పించి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ఇంతటి అభివృద్ధి చేసిన మంత్రి దొరకడం మన అదృష్టమని అన్నారు.. ఎన్నో పార్టీలు వచ్చినై పోయినాయి కానీ ఏ పార్టీ రాజకీయ నాయకులు కూడా చెయ్యలేని అభివృద్ధి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేశారు.
జాగిర్యాల్ గ్రామాన్ని కూడా సంఘాలకు గ్రామానికి సీసీ రోడ్, డ్రైనేజ్ కట్టడాలకు ఎన్నో కోట్ల రూపాయలతో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చెయ్యడంతో మాకు చాలా సంతోషం అనిపించింది దాని కొరకు మేము మంత్రి వెంటే ఉంటాము మంత్రికి ఓటు వేసి మూడోసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని. మద్దతు తెలపడం జరిగింది. సంఘంలో తీర్మానం చేసి సభ్యులు సంఘం పత్రంపై సంతకాలు చేసి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గడలా ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్ గౌడ్ మనస శ్రీనివాస్ ఎంపీటీసీ సుమలత రాజేష్ ఉపసర్పంచ్ శ్రీకాంత్ సీనియర్ నాయకులు రాజమల్లు లక్ష్మి రాజా గౌడ్ శ్రీనివాస్, సంఘ పెద్దమనిషి గడలా మూర్తి, రఘుపతి లక్ష్మణ్ సంఘ సభ్యులు ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డికి పంపించారు. మంత్రి చేసిన అభివృద్ధి కి సంఘం అండగా ఉంటుందని తెలిపారు.