ఓటర్లరా జాగ్రత్త!…సయ్యద్ అవేజ్.

On: Tuesday, July 8, 2025 7:40 PM

 

 *నడ్డి విరిచే నాయకుల్ని తేల్చే సమయం వచ్చింది.

 

A9 న్యూస్ ,ప్రతినిధి నిజామాబాద్:

నిరుపేదలకు ఇల్లు ఉండక, భూమి లేక బాధలతో జీవితం సాగిస్తున్న మన ప్రజలకు అండగా నిలిచే నాయకులు ఇప్పుడు ఎక్కడ?.

నాయకత్వం అనేది విలాసవంతమైన ఏసీ కార్లలో తిరగడం కాదు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం కాదు,

ఐదేళ్లకు ఒకసారి ఓటర్లను డబ్బు, మద్యం ఎత్తిపోతలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మిగిలిన ఐదేళ్లంతా మామూళ్ల మత్తులో ప్రజలను దూరంగా పెట్టే రాజకీయ నాయకులు ఇక చరిత్రగా మిగలాల్సిన సమయం ఆసన్నమైంది.

ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి ధైర్యం ఇచ్చే వారే నిజమైన నాయకులు ప్రజల సమస్యలపై స్పందించి వాటిని పరిష్కరించే వారే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వారవుతారు.

ఈ సారి చురుకైన ఆర్మూర్ ప్రజలు కళ్ళు తెరిచి సమస్యల పట్ల గళం ఎత్తే ప్రజల కోసం నిలిచే నాయకుడికే మద్దతు ఇవ్వాలి మిగిలిన వారికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.

అని సయ్యద్ అవేజ్,

ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్,

ఆమ్ ఆద్మీ పార్టీ అన్నారు.

23 Jul 2025

Leave a Comment