A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ కు చెందిన మల్లెపూల సందీప్ (36), రవికుమార్ కలిసి కార్పెంట్ షాపు నిర్వహించగా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులు కలగడంతో సందీప్ మనస్తాపం గురై చెదల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫోర్ టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.