రఘునందన్ రావు ను పరామర్శించిన బిజెపి మున్సిపల్ అధ్యక్షులు….

On: Monday, June 30, 2025 6:25 AM

A9 న్యూస్ మెదక్ ప్రతినిధి:

మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కు చిన్న శస్త్రచికిత్స జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ను ఆదివారం తూప్రాన్ మున్సిపల్ ప్రెసిడెంట్ భూమనగారి జానకిరామ్ గౌడ్ కలిశారు. మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు ని యశోద హాస్పిటల్‌లో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల రఘునందన్ రావుకి చిన్న ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో జానకిరామ్ గౌడ్ ఆయనను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీ రఘునందన్ రావుని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

23 Jul 2025

Leave a Comment