*ఇంద్రప్రస్థపై బురదజల్లే వారికి చట్టమే బుద్ధి చెప్తుంది….
*యజమాని గట్టు శ్రీనివాస్…
A9 న్యూస్ ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్ గ్రామంలో అభివృద్ధి చేస్తున్న ఇంద్రప్రస్థ వెంచర్పై కొంత మంది వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేస్తుండటం బాధాకరమని వెంచర్ యజమాని గట్టు శ్రీనివాస్ పేర్కొన్నారు.
మూడు ఎకరాలు 28 గుంటల భూమిలో 60 ప్లాట్‌లతో అభివృద్ధి చేసిన ఈ వెంచర్‌లో గతంలో యజమాని తన స్నేహితుడు మ్యాక్ నవీన్‌కు మార్కెట్ విలువకంటే తక్కువ ధరకు మూడు ప్లాట్లు ఇచ్చినట్టు తెలిపారు. అయితే పూర్తిగా డబ్బులు చెల్లించకుండా రిజిస్ట్రేషన్ లేకుండా నిలిపివేసిన తర్వాత తాను చేసిన మానవతా సహాయాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
నా పరువు ను దెబ్బతీయడానికే ఈ కుట్ర జరుగుతోంది అని తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు మిగిలిన మొత్తం రుసుము చెల్లించమన్నదే తప్పు అయితే అది చట్టపరంగా ఎలా న్యాయమైనది అవుతుంది అని శ్రీనివాస్ ప్రశ్నించారు.
వెంచర్‌కు సంబంధించిన అన్ని అనుమతులు డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయని భూమి యజమానులకు తాను డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తున్నట్లు వివరించారు బెదిరింపులకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.