A9 న్యూస్,
ఆర్మూర్,18
ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం రాత్రి 7 గంటల సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని మోదీ 10 సెప్టెంబర్ 2023 లో దేశంలో అన్ని ఆలయాలలో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో అప్పటి నుండి హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించామని ఈ శనివారంతో 69 వ వారం పూర్తి చేసుకున్నామని కోటేశ్వరరావు తెలిపారు. ఇలాగే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణo కొనసాగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పారాయణంలో పాల్గొనాలని కోరారు. మా కాలనీని ఆదర్శంగా తీసుకొని ప్రతీ కాలనీలోని హనుమాన్ ఆలయాలలో చాలీసా పారాయణం చేయాలని కోరారు.