మహబూబాబాద్ అటవీశాఖ రేంజ్ పరిధి లోని నాయకపల్లి, గాజులగట్టు బీట్ అధికారులను సస్పెండ్ చేసినట్లు డీఎఫ్వో బత్తుల విశాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాయకపల్లి, గాజులగట్టు బీట్ అధికారులు విధులు నిర్వర్తించడంలో ఆలసత్వం, నిర్లక్ష్యం వహించడంతో పాటు అటవీభూముల ఆక్రమణ జరిగిందని ఉన్నతాధికారుల దృష్టికి సమాచారం వెళ్లడం తో విచారణ అనంతరం వారిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై మహబూబాబాద్ రేంజ్ అధికారి జ్యోత్స్న దేవిని సస్పెండ్ చేసిన మాట వాస్తవమేనన్నారు.