A9 న్యూస్ ,ప్రతినిధి నిజామాబాద్:
డిజిపి ఆదేశాలతో కొనసాగిన ప్రక్రియలో పదోన్నతులు పొందిన సిబ్బంది కి కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఎనిమిది మంది హెడ్ కానిస్టేబుళ్లకు (హెచ్ సి) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై) లుగా పదోన్నతులు లభించాయి.
ఈ సందర్భంగా తాజాగా పదోన్నతిని పొందిన ఏఎస్సై లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపిఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
పదోన్నతుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సిబ్బంది, ఇప్పుడు అవకాశం రావడంతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ చైతన్య శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో మరింత సమర్థంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.
పదోన్నతి ఎం.డి. రియాజుద్దీన్ హెడ్ కానిస్టేబుల్ నందిపేట్ పోలీస్ స్టేషన్, పరమేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ మోపాల్ పోలీస్ స్టేషన్, వసంత్ రావు హెడ్ కానిస్టేబుల్ నిజామాబాద్,
జక్రయ్య హెడ్ కానిస్టేబుల్ టౌన్-6వ నిజామాబాద్,
అరుణ కుమారి మహిళా హెడ్ కానిస్టేబుల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్, అనురాధ రూరల్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్,
జీ.వి. రమనేశ్వరి నిజామాబాద్, ముంతాజ్ బేగం నిజామాబాద్ పొందిన ఏఎస్సైలు.
ఈ పదోన్నతులు సిబ్బందిలో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి పోలీస్ విభాగంలో సమర్థత నిబద్ధత కలిగిన ఉద్యోగులకు గుర్తింపు లభించడంపై సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.