ఆర్మూర్ ఆగస్ట్ 15,
ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘ భవనంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ జెండా ఆవిష్కరణ చేసి, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించారు. ముఖ్యంగా పద్మశాలి ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ త్యాగస్ఫూర్తిని కొనియాడారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొక్కుల రమాకాంత్, కోశాధికారి భాస్కర్, సర్వసమాజ్ ప్రతినిధి విద్యసాగర్, సలహాదారులు చిట్ల ప్రకాష్, అంబళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఘనపూరం సంతోష్, కట్కామ్ నరేందర్, తర్ప అధ్యక్షులు అంబటి కృష్ణహరి, బండి అనంతరావు, రుద్ర రాజేశ్వర్, సైబ సుధాకర్, వేముల ప్రకాష్, గణపతి, బండి రాజు తదితరులు పాల్గొన్నారు.







