5.8 కిలోల మాదక ద్రవ్య రవాణా – ఇద్దరు యువకుల అరెస్ట్, లారీ స్వాధీనం…

On: Thursday, September 18, 2025 8:53 PM

 

మాసాయిపేట, సెప్టెంబర్ 18:

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు పాపిస్టా పౌడరు రవాణా చేస్తూ పోలీసులకి అడ్డంగా చిక్కారు. నమ్మదగిన సమాచారం మేరకు, మాసాయిపేట గ్రామ శివారులోని బాబా రాందేవ్ రాజస్థాన్ దాబా వద్ద సబ్ ఇన్‌స్పెక్టర్ జి. చైతన్య కుమార్ రెడ్డి నేతృత్వంలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించింది.

తనిఖీ సమయంలో లారీ ద్వారా అక్రమంగా సుమారు 5.8 కిలోల పాపిస్టా పౌడరు రవాణా చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే ఆ లారీని స్వాధీనం చేసుకుని, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

అరెస్టు చేయబడినవారు:

సవాల్ పాండే, తండ్రి పేరు: సురేందర్ పాండే (వయసు 40, లారీ డ్రైవర్),అతని తమ్ముడు నీలేష్ పాండే (వయసు 22).

ఇద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బబ్న వులి చానుకి పోస్టుకు చెందినవారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని న్యాయ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నది.

05 Feb 2026

Leave a Comment