మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులకు అస్వస్థత…..

On: Monday, November 10, 2025 9:10 PM

 

కరీంనగర్ జిల్లా: నవంబర్10

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశా లలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.వెంటనే స్పందించిన ఉపాధ్యాయు లు చికిత్స నిమిత్తము జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మధ్యాహ్న భోజనంలో గుడ్లు దుర్వాసన వచ్చా యని అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్వస్థతకు గురైన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

జమ్మికుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన పట్ల మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాల ల్లో భోజన నిర్వహణ ను ప్రభుత్వం గాలికొదిలేసిన ట్టు ఇటీవల జరిగిన పలు ఘటనలు రుజువు చేస్తున్నాయని అయన అన్నారు.

07 Dec 2025

Leave a Comment