గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 9 వేల ఇందిరమ్మ ఇండ్లు.
ఈరోజ మున్ననూర్‌లో మంజూరుఇండ్లు పత్రాలు అందజేయనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.
సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని వారి సొంతింటి కలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, మున్ననూర్, ఏటూరు నాగారం నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్ధ (ఐటిడిఎ)ల పరిధిలోని 21 నియోజకవర్గాలలో సాచురేషన్ పద్దతిలో 13,266 చెంచు కుటుంబాలను ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు పలు సందర్బాలలో సూచించడం జరిగిందని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు కూడా అనేక సందర్బాలలో గిరిజన ప్రాంతాలలో అభివృద్ది.