10వ తెలంగాణ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైన మాదరి ప్రణయ….

On: Wednesday, December 24, 2025 8:08 AM

A9 న్యూస్ ప్రతినిధి:

ఈ నెల 24 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణ క్రీడా ప్రాంగణం, మనోహరాబాద్లో నిర్వహించనున్న 10th తెలంగాణ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ 2025–26కు TGSWRS (గర్ల్స్), ధర్మారం పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని మాదరి ప్రణయ (తండ్రి: మాదరి స్వామి) ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాధవి లత, వైస్ ప్రిన్సిపల్ ప్రేమలత, పిడీ నీరజ, పీఈటీ స్వప్న, క్లాస్ టీచర్ సుమలత, అలాగే సాఫ్ట్‌బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గంగ మోహన్ విద్యార్థిని మాదరి ప్రణయను ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి సాధన చేస్తే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొంటూ, రాబోయే పోటీల్లో మరింత ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.

04 Feb 2026

Leave a Comment