హైదరాబాద్:జనవరి 25:
హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం బచాస్ ఫర్నిచర్ క్యాజిల్ దుకాణం, గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు బేబీ(45), హబీబ్(32), ఇంతియాజ్(28), అఖిల్, 11 ప్రణీత్(08)గా గుర్తించారు.
మృతదేహాలను ఉస్మాని యా ఆస్పత్రికి తరలించా రు. మృతులంతా సెల్లార్‌లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదం ధాటికి పూర్తిగా భవనం దెబ్బ తింది. భవనం పరిస్థితిని పరీక్షించే పనిలో జెఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం ఉంది. భవనం కూల్చివేతపై త్వరలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఫర్నీచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
నాంపల్లి ఫర్నిచర్ దుకాణం లో అగ్ని ప్రమాద బాధితుల కు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా, ప్రకటించింది, మృతుల కుటుంబాలకు రూ “5 లక్షల చొప్పున పరిహారం ప్రకటిం చింది నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్ర మాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిం ది.. దాదాపు ఒక రోజంతా రెస్కు ఆపరేషన్ సాగింది, ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఆ మృత దేహాలకు ఆదివారం మధ్యాహ్నం పోస్టుమా ర్టం పూర్తి అయింది ఆ కు టుంబాలకు మృతదేహాలు అప్పగించారు. ఐరన్ షెటర్ కు తాళం వేయడంతో బయటకు రాలేకపోవడంతో వారందరూ మృతి చెందారని అగ్నిమాపక సిబ్బంది అధికారి తెలిపా రు. సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.








