వర్షాకాలం మరియు చలికాలంలో విధుల నిర్వహణ కష్టం అవుతదన్న ముందు జాగ్రత్తలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐపీఎస్., గారు నిజామాబాదులోని 369 మంది హోంగార్డ్స్ కు వులెన్ జాకెట్స్ ప్రధానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం మరియు చలి కాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ వులెన్ జాకెట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని విధినిర్వహణలో కూడా క్యారీ చేసి అవసర నిమిత్తం ఉపయోగించుకోవాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా హోంగార్డ్స్ విభాగం ఇన్చార్జ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ , వెల్ఫేర్ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి తదితరులు ఉన్నారు.