లక్కంపల్లిలో అక్రమ నిర్మాణాలు…..

*లక్కంపల్లిలో అక్రమ నిర్మాణాలు….

*అధికారుల పట్టింపులేకపోవటంపై ప్రజల్లో అసంతృప్తి….

A9 న్యూస్ ప్రతినిధి:

నందిపేట్ మండలంలోని లక్కంపల్లి గ్రామ శివారులో పర్మిషన్ లేకుండా చేపడుతున్న బారీ షట్టర్ల నిర్మాణాలు కలకలం రేపుతున్నాయి బైపాస్ రోడ్డులో జరుగుతున్న ఈ నిర్మాణాలపై పంచాయతీ శాఖ అధికారులు పట్టించుకోకపోవటంపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది

ప్రజల అభిప్రాయం ప్రకారం సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టించడమే ఈ అక్రమ నిర్మాణాలపై వారు చూసి చూడనట్లు వ్యవహరించడానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి పంచాయతీ శాఖ కేవలం నోటీసులు జారీ చేయడమే తప్ప నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవటం పట్ల నిజాయితీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ వృద్ధి భవిష్యత్తులో భద్రత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలను వెంటనే ఆపాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల రాబోయే కాలంలో చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రజల పక్షాన స్పందించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను మండల స్థాయి అధికారులు జిల్లా పరిపాలన గమనించి స్పందించాల్సిన అవసరం ఎంతైనది.

Leave a Comment