సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయండి

నిజామాబాద్ జిల్లా A9న్యూస్:

IMG 20231101 WA0010

ఈనెల 3న ఆర్మూర్ లో జరగనున్న సీఎం సభను విజయవంతం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ లోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ ఎస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతగా ప్రజా ఆశీర్వాద సభను ఆర్మూర్ లోని సిద్దులగుట్ట పక్కనగా దోబీ ఘాట్ ఆలూరు బైపాస్ రోడ్డులో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

Leave a Comment