హీరో అల్లు అర్జున్ అరెస్ట్, 16 రోజుల రిమాండ్:

 

 

 

 

హైదరాబాద్:డిసెంబర్ 13

ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌ లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసు కెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబా ద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

పోలీస్ వాహనం ఎక్కేముందు తండ్రి అల్లు అరవింద్, సతీమణి స్నేహ రెడ్డితో అల్లు అర్జున్‌ మాట్లాడారు. సతీమణి స్నేహకు ముద్దు పెట్టిన బన్నీ.. పోలీసులతో కలిసి వాహనం ఎక్కారు.

 

స్టార్ హీరో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదయ్యా యి. 105 సెక్షన్‌ కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదైంది.

 

దీంతో ఈరోజ మధ్యాహ్నం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధిం చింది, ఈ మేరకు కోర్టు న్యాయ వాది ఆదేశాలు జారీ చేశారు. బన్నీ థియే టర్ వద్దకు రావడంతోనే తొక్కిసలాట సంఘటన జరిగిందని, పోలీసులు కోర్టుకు నివేదించారు.

Leave a Comment