హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్‌డ్ తుపాకులు ఉన్నవారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో వాటిని అప్పగించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల23న ఎన్నికలు జరిగి 25న ఫలితాలు వెలుడవతాయని తెలిపారు. 29వ తేదీ తర్వాత ఎవరి తుపాకులు వారికి అందజేస్తారని సీపీ వెల్లడించారు. తుపాకులు డిపాజిట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు..