A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ కోటార్మూర్ ప్రాంతంలో గల శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో శనివారం రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ పి సత్యనారాయణ గౌడ్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వారికి అర్చన చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ, ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.