ఖుదవంద్ పూర్ గ్రామంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు.

IMG 20230921 WA0021 1 IMG 20230921 WA0024

ఖుదవంద్ పూర్ లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి A9న్యూస్.

నందిపేట్ మండలం, ఖుదవంద్ పూర్ గ్రామం లో గురువారం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఖుదవంద్ పూర్  గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశానుసారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఖుదవంద్ పూర్ లో పంచిన రూపాయలు 99,500 /- విలువగల చెక్కులను పంపిణీ చేశారు.

లబ్ధిదారులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసానిస్తుందని అన్నారు.

ఇట్టి చెక్కులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ కోల్కొండ చిన్న సాయన్న, ఎంపీటీసీ అన్నగౌడ గోదావరి ప్రవీణ్ గౌడ్,జావీద్ మురడి చిన్నారెడ్డి, మహిళా సంఘ సభ్యులు సుమతి, యమున,రాణి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Comment