కారు ఢీ.. 10 మీటర్ల దూరంలో గాల్లోకి ఎగిరిపడ్డ యువతి..

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:

హైదరాబాద్ లోని వనస్థలిపురం ఎన్ జి ఓ ఎస్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద పార్క్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె 10 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Leave a Comment