A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం నిరుపేదలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళ సంగా భవనంలో బిగ్ టివి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. బిగ్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా హెల్త్ క్యాంపు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బిగ్ టివి యాజమాన్యానికి, మెడికవర్ వైద్య సంస్థకు ఈ సందర్భంగా అభినందించారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాలు నొప్పులు ఈసీజీ ఇతరత్రా ఆరోగ్య సమస్యలను వైద్యనిపుణులు పరీక్షించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ వైద్య నిపుణులు, మాజీ ఎంపీటీసీ అబ్దుల్ నయీమ్, తదితరులు హాజరయ్యారు.