ఆర్మూర్ టీచర్ కాలనీలో క్షత్రియ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు…..

A9 న్యూస్:

IMG 20240928 WA0016

ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ స్కూల్ టీచర్స్ కాలనీ నందు శనివారం రోజున పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలను స్కూల్ యాజమాన్యం అల్జాపూర్ లక్ష్మీనారాయణ, రాజసులోచన, కోశాధికారి గంగాధర్, అక్షయ్, శ్రేయ, మరియు పాఠశాల ప్రిన్సిపాల్ నవిత కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు తంగేడు, గునుగు పూలతో చక్కటి బతుకమ్మను తయారుచేసి ఆటపాటలతో విద్యార్థులలో ఉత్సాహమును నింపి ఆనందముగా బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులకు బతుకమ్మ పండగ యొక్క విశిష్టతను గురించి వివరించామని స్కూల్ ప్రిన్సిపల్ నవిత తెలియజేశారు.

IMG 20240928 WA0015

Leave a Comment