మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేసిన హజారి విఠోబా అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో నివసించే ఉప్లూర్ గ్రామానికి చెందిన హజారి విఠోబా అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేసి కొట్టాడని, చంపుతానని బెదిరిస్తున్నట్లు ఈ నెల 28న ఆర్మూర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు.

గతంలో సైతం విఠోబా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే మందలించడం జరిగిందన్నారు. దీన్ని మనసులో పెట్టుకొని కక్ష సాధించడానికి పథకం ప్రకారం పాత బస్టాండ్ సమీపంలో తనపై దాడి చేసి కొట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పారు. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సె అశోక్ విచారణ జరిపి విఠోబా పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Leave a Comment