ఆర్మూర్ లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని…ఆకస్మికంగా తనిఖీలు….

నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణం ఆరోగ్య కేంద్రంలోని ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమం, 126 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు మరియు 16 మంది మహిళల రక్త నమూనాలు సేకరించడం జరిగింది.

వీరందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుదర్శన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళ ఆరోగ్య పరీక్షల నిమిత్తం సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందగలరని తెలియజేశారు,

ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, డాక్టర్ మానస, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment