బిజెపి నాయకులు మండల శాఖ డిమాండ్.
మాసాయిపేట తాసిల్దార్ జ్ఞాన జ్యోతి కి వినతి పత్రం.
మాసాయిపేట ,ఎ9 న్యూస్, ఆగస్ట్ 23:
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు:
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన రైతులు పంటల నష్టం కలిగింది అనేక గ్రామాల్లో ఇళ్లు కూలిపోవడం, రహదారుల పరిస్థితి అధ్వానంగా మారడం, విధిదీపాలా సమస్యలు ఉత్పన్నమవడం, డ్రైనేజీలలో దోమల సమస్యలు తీవ్రంగా పెరగడం జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రభావిత రైతులకు పంట నష్టపరిహారం అందించాలి, ఇళ్లు కోల్పోయిన బాధితులకు గృహాలు మంజూరు చేయాలి, గ్రామాల్లో రహదారులు మరమ్మతు చేయించాలి, డ్రైనేజీలకు దోమల మందు పిచికారీ చేయాలి, అలాగే సర్పంచ్ ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాలన్న డిమాండ్‌తో మాసాయిపేట మండలం తాసిల్దార్ కి బీజేపీ తరఫున వినతి పత్రం సమర్పించింది అని అన్నారు అనంతరం
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్, శివకుమార్ గౌడ్, యువమోర్చా అధ్యక్షులు గోగొండ విఠల్, మండల కార్యవర్గ సభ్యులు ముక్క యాదగిరి, సీనియర్ నాయకులు మంగళి బాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.







